ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాడు పండుగ కానుకలు...నేడు పస్తులుండే పరిస్థితి' - జగన్​పై వంగలపూడి అనిత కామెంట్స్

ప్రజలపై పన్నుల భారం మోపి సంపద పోగేసుకోవటమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారా? అని తెదేపా మహిళనేత వంగలపూడి అనిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెదేపా హయాంలో ప్రజలకు ఉచితంగా పండుగ కానుకలు ఇస్తే... నేడు పస్తులుండే పరిస్థితిని తీసుకొచ్చారని ఆమె విమర్శించారు.

anitha
నాడు పండుగ కానుకలు...నేడు పస్తులుండే పరిస్థితి

By

Published : Oct 25, 2020, 2:22 PM IST

తెదేపా హయాంలో ప్రజలకు ఉచితంగా పండుగ కానుకలు ఇస్తే...నేడు పస్తులుండే పరిస్థితిని తీసుకొచ్చారని తెదేపా మహిళనేత వంగలపూడి అనిత దుయ్యబట్టారు. ప్రజలపై పన్నుల భారం మోపి సంపద పోగేసుకోవటమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదాయం సృష్టించటం చేతకాక పప్పు బెల్లాలపై పన్నులు విధించడంతో పాటు ఉల్లి, క్యారెట్ ధరలు రూ. 120కి పైగా ఎగబాకేలా చేశారని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలపై కనీసం సమీక్షించారా ? అని నిలదీశారు. ఆర్భాటాల కోసమే ధరల స్థిరీకరణ నిధి ప్రకటన చేశారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details