నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిపేందుకు వైకాపాకు భయమెందుకని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్ని సజ్జల రామకృష్ణారెడ్డి వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. లక్షల రూపాయల ప్రజాధనం జీతంగా తీసుకుంటూ... కోర్టు తీర్పులను వక్రీకరించడం నేరమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి... వైకాపా అధికార ప్రతినిధిగా అబద్ధాలు చెప్పుకోవాలని హితవు పలికారు. పరిషత్ ఎన్నికల్లో వైకాపా చేసిన ఉగ్రవాద చర్యలు ప్రజలు చూడలేదనుకోవటం వాళ్ల భ్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికలు బహిష్కరించే దారుణ స్థితి కల్పించారని వ్యాఖ్యానించారు.
కోర్టు తీర్పులను సజ్జల వక్రీకరిస్తున్నారు: వంగలపూడి అనిత - Vangalapudi Anitha news
హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వక్రీకరిస్తున్నారని... తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. తన పదవికి రాజీనామా చేసి వైకాపా అధికార ప్రతినిధిగా అబద్ధాలు చెప్పుకోవాలని విమర్శించారు.

తెదేపా మహిళా నేత వంగలపూడి అనిత