'దళితులు కేవలం ఓట్లకేనా...రాజ్యసభకు పనికిరారా?' - vangalapudi anitha comments on rajyasaba elections
దళితుల పట్ల వైకాపాది కొంగ జపమేనని ప్రజలకు అర్థమవుతోందని తెదేపా మహిళా నాయకురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. 29 మంది ఎస్సీ, ఏడుగురు ఎస్టీ శాసనసభ్యులు ఉన్నా..,ఒక్క రాజ్యసభ సీటు కూడా దళితులకు ఇవ్వలేదని మండిపడ్డారు.
'దళితులు కేవలం ఓట్లకేనా...రాజ్యసభకు పనికిరారా?'
దళితులు కేవలం ఓట్లకేనా? రాజ్యసభకు పనికిరారా? అని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. డబ్బును చూసే పరిమళ్ నత్వానిలకు సీటిచ్చారని దుయ్యబట్టారు. దళితుల పట్ల వైకాపాది కొంగ జపమేనని ప్రజలకు అర్థమవుతోందన్నారు. 29 మంది ఎస్సీ, ఏడుగురు ఎస్టీ శాసనసభ్యులు ఉన్నా..,ఒక్క రాజ్యసభ సీటు కూడా దళితులకు ఇవ్వలేదని మండిపడ్డారు.