ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వందే భారత్ మిషన్: విజయవాడ విమానాశ్రయానికి 30 వేల మంది ప్రయాణికులు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వందే భారత్ మిషన్ ద్వారా తరలివచ్చిన ప్రయాణికుల సంఖ్య 30 వేల మార్కుకు చేరువైంది. రాష్ట్రానికి చేరుకుంటున్న ప్రయాణికులకు తొలుత మెడికల్ స్క్రీనింగ్.., అనంతరం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలు, కొవిడ్ రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

విజయవాడ విమానాశ్రయానికి 30 వేల మంది ప్రయాణికులు
విజయవాడ విమానాశ్రయానికి 30 వేల మంది ప్రయాణికులు

By

Published : Nov 7, 2020, 9:53 PM IST

వందే భారత్ మిషన్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలివచ్చిన ప్రయాణికుల సంఖ్య 30 వేల మార్కుకు చేరువైంది. తెదేపా హయాంలో ఒక్క సింగపూర్ సర్వీస్​తో ప్రారంభమైన విదేశీ విమానాల సంఖ్య ప్రస్తుతం 200 దాటడం విశేషం. వందే భారత్ ద్వారా విజయవాడకు విదేశీ సర్వీసుల అవసరాన్ని పౌర విమానయాన శాఖ గుర్తించింది. రాష్ట్రానికి చేరుకుంటున్న ప్రయాణికులకు తొలుత మెడికల్ స్క్రీనింగ్.., అనంతరం ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలు, కొవిడ్ రాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన ప్రయాణికులను వారి నివాసాలకు పంపిస్తున్న అధికారులు...అనుమానిత లక్షణాలు, పాజిటివ్ వచ్చిన వారిని కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details