ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గమ్మకు సారె సమర్పించిన ఆలయ వైదిక కమిటీ

విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చక సిబ్బంది తదితరులు అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. వీరికి ఆలయ ఈవో సురేష్​ బాబు స్వాగతం పలికారు.

Breaking News

By

Published : Jul 20, 2020, 12:47 PM IST

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చక సిబ్బంది, వాయిద్యకారులు కనకదుర్గ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివ ప్రసాద్​ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్​ బాబు వీరికి స్వాగతం పలికారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. కరోనా మహమ్మారి వైదొలగి... లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details