వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి నిధుల కేటాయింపును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దేవాదాయశాఖ నిధులను వాహనమిత్రకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ.. భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ లబ్ధి కోసం దేవాదాయశాఖ నిధుల్ని ఖర్చుచేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. నిధులు ఖర్చు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను జులై 5కు వాయిదా వేసింది.
VAHANAMITHRA: వాహన మిత్ర స్కీమ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - వాహనమిత్ర స్కీమ్ కేసు తాజా వార్తలు
వైఎస్సార్ వాహన మిత్ర స్కీమ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై.. నేడు విచారణ జరిగింది. వాహన మిత్రకు దేవాదాయశాఖ నిధులు ఖర్చు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చిన న్యాయస్థానం.. తదుపరి విచారణను జులై 5కి వాయిదా వేసింది.

వాహన మిత్ర స్కీమ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ
Last Updated : Jun 29, 2021, 8:56 PM IST