కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఈనెల 23 నుంచి 30 వరకు జరగనున్న చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో వాహనాల ఊరేగింపులను రద్దు చేసినట్లు ఆలయ ఈవో డి. భ్రమరాంబ తెలిపారు. దేవాలయంలో వెండి పల్లకిపై ఊరేగించనున్నట్లు తెలిపారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. భక్తులు, ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో వెల్లడించారు.
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో వాహనాల ఊరేగింపు రద్దు - vijaywada durga temple latest news
విజయవాడ దుర్గగుడిలో జరగనున్న చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో వాహనాల ఊరేగింపులను రద్దు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
corona effect on vijayawada durga temple
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని ఈవో భ్రమరాంబ స్పష్టం చేశారు. సామాజిక దూరం పాటించాలని సూచించారు. వరుసల్లో ప్రవేశించినప్పుడు క్యూలైన్లను తాకుండా అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి