రాష్ట్రంలో వైకాపా సర్కారు.. పేదలు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొలాలను బలవంతంగా లాక్కుంటోందని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహించారు. విశాఖలోని మంత్రుల భూములను ఎందుకు పంచటం లేదని ఆయన ప్రశ్నించారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అసాధ్యమని అభిప్రాయపడిన వడ్డే... సరైన సలహాలు ఇవ్వలేని ప్రభుత్వ సలహాదారులతో రాష్ట్రానికి ఉపయోగమేంటని ప్రశ్నించారు.
'భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు' - వడ్డే శోభనాద్రీశ్వర రావు తాజా వార్తలు
2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు మండిపడ్డారు. ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న పొలాలను బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహించారు.
!['భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు' భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6163399-878-6163399-1582364640865.jpg)
భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు