Vacancies in AP Model Schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ (ఏపీఎంఎస్).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 282
పోస్టులు–ఖాళీలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)-71, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)-211.
అర్హత:పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతభత్యాలు:టీజీటీలకు నెలకు రూ.28,940, పీజీటీలకు నెలకు రూ.31,460 చెల్లిస్తారు.