టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా - Uttam Kumar Reddy resigns as TPCC president news
![టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9765814-441-9765814-1607092241057.jpg)
19:29 December 04
టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో వైఫల్యానికి నైతిక బాధ్యతగా విధుల నుంచి తప్పుకున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఏఐసీసీని ఉత్తమ్ కోరారు.
తెలంగాణలో ఇటీవల దుబ్బాక ఉపఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ... బల్దియా ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని చవిచూసింది. గతంలో మేయర్ పీఠాన్ని అధిరోహించిన హస్తం పార్టీ... ఈసారి అట్టడుగు స్థానంలో నిలిచింది. గతంలోలాగే రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయటం వల్ల ఇప్పడు కొత్త సారథి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ ఫలితాలు: 55 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల జయకేతనం