జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ వంద సీట్లు గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో అభివృద్ధి పనులు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్లోని వారాసిగూడ ప్రాంతంలో అభ్యర్థి ప్రభతో కలిసి పాదయాత్ర చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రగా వారాసిగూడ చౌరస్తా నుంచి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
తెరాస చేసిందేమి లేదు
అభ్యర్థి ప్రభకి ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరదల నేపథ్యంలో, కరోనా విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా గెలవడం అసాధ్యమని, మతతత్వ రాజకీయాలతో కాలం వెళ్లదీస్తూ ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, భాజపా, ఎంఐఎంలు ఒక్కటేనని విమర్శించారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు, సదుపాయాలతో పాటు రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, అనేక అభివృద్ధి పథకాలు, తాగునీటి సరఫరా అనేక విషయాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప తెరాస చేసిందేమీ లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది: ఉత్తమ్ ఇదీ చదవండి:
25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్