ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈనెల 18 నుంచి 'పోరుగర్జన'.. సీపీఎస్ రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదు: ఏపీయూటీఎఫ్

సీపీఎస్ రద్దు చేసే వరకు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఏపీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. 'పోరుగర్జన' పేరిట ఈనెల 18 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

By

Published : Apr 14, 2022, 7:50 PM IST

Published : Apr 14, 2022, 7:50 PM IST

ఈనెల 18 నుంచి 'పోరుగర్జన'
ఈనెల 18 నుంచి 'పోరుగర్జన'

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 'పోరుగర్జన' పేరిట ఈనెల 18 నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. యూటీఎఫ్, మిగతా సంఘాలు చేసిన పోరాటాల వల్ల గత ప్రభుత్వం టక్కర్ కమిటీ వేసిందని ఆ కమిటీ రిపోర్టు వచ్చినా..పెన్షన్ విధానాన్ని అమలు చేయలేదని చెప్పారు.

ఇక ప్రభుత్వంపై పోరు చేయక తప్పదని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, అనంతపురం నుంచి నాలుగు జాతాలు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ పోరుగర్జన బైక్ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. సీపీఎస్ రద్దు చేసే వరకు విశ్రమించబోమని.., తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: జగన్​కు దమ్ముంటే.. వారిని సీఎం చేయాలి: జీవీఎల్

ABOUT THE AUTHOR

...view details