పట్టణ ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం.. సంబంధిత మున్సిపల్ కమిషనర్.. ఛైర్ పర్సన్‌గా వివిధ విభాగాలకు చెందిన 9 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీల్లో మార్పు చేస్తూ సవరణ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అర్బన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు - కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అర్బన్ టాస్క్ ఫోర్స్ తాజా వార్తలు
పట్టణ ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం అర్బన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి.
![కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అర్బన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అర్బన్ టాస్క్ ఫోర్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9955387-1041-9955387-1608549606862.jpg)
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అర్బన్ టాస్క్ ఫోర్స్
రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ సభ్యుల సంఖ్యను 16కు, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్‌లో 34 మంది సభ్యులను చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సవరించింది. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం నియమించిన కమిటీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, యూఎన్డీపీ, ఎన్జీవోస్ సంస్థతో సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేసింది.
ఇదీ చదవండి:కెరీర్ చివరిలో ఇలాంటి పిటిషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది: జస్టిస్ రాకేష్ కుమార్