ఎన్నడూ లేని విధంగా చెత్త సేకరణపై చార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం శోచనీయమని పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ బాబురావు అన్నారు. వెంటనే ఆ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలో సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మంగళవారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో చెత్తపై సేవా ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు వెలువడినట్లు ఆయన తెలిపారు. గ్రేడ్ 1,2,3 మున్సిపాలిటీల్లో రోజుకు ఒక రూపాయి చొప్పున సంవత్సరానికి రూ.365, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీల్లో రోజుకు 2రూపాయల చొప్పున సంవత్సరానికి రూ.730, నగరపాలక సంస్థల్లో రోజుకి రూ.3 చొప్పున సంవత్సరానికి రూ. 1100 ప్రతి కుటుంబం నుంచి వసూలు చేయాలని ఆదేశించారని ఆయన ఆరోపించారు.