సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కారుపై దుండగులు దాడి చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం అవరణలో నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. ఘటనాస్థలాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, నారాయణగూడ పోలీసులు పరిశీలించారు. దుండగులు ఎవరై ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దుండగుల దాడి - సీపీఐ కార్యాలయంపై దుండగులు దాడి
సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. ఈ దాడిపై లోతైన విచారణ జరిపించాలని జాతీయ కార్యదర్శి నారాయణ పోలీసులను కోరారు.
unkown-persons-attack-on-cpi-state-office-and-destroyed-chada-venkatreddy-car
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ అప్రజాస్వామిక దాడిని ఖండిస్తున్నట్టు నారాయణ తెలిపారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఇద్దరు యువకులు... ద్విచక్రవాహనంపై వచ్చి దాడిచేశారని ఆరోపించారు. దీనిపై లోతైన విచారణ జరిపించాలని కోరారు.