ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Telangana CM KCR: కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన.. అపోహలు-వాస్తవాలు పేరిట ప్రకటన - CM KCR comments on power policy

Union Power Ministry response: భాజపా ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్​ సంస్కరణలపై.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ స్పందించింది. అపోహలు- వాస్తవాలు పేరిట కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.

Union Power Ministry response to CM KCR comments
కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన

By

Published : Feb 15, 2022, 10:50 PM IST

Union Power Ministry response: భాజపా ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్​ సంస్కరణలపై.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ స్పందించింది. అపోహలు- వాస్తవాలు పేరిట కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయట్లేదని కేంద్రం ప్రకటనలో వివరించింది. ఓపెన్‌ బిడ్‌ల ద్వారానే కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. విద్యుత్ కనెక్షన్లు కచ్చితంగా ఇవ్వాలని రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని స్పష్టతనిచ్చింది.

రాష్ట్రాల సొంత నిర్ణయం..

"సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు పునరుత్పాదక ఇంధనం కోసం ఓపెన్ బిడ్లు నిర్వహిస్తోంది. ఈ బిడ్‌లలో అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. తక్కువ టారిఫ్‌ను అందించే కంపెనీలు ఓపెన్ బిడ్ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయబడతాయి. ఆ బిడ్‌ల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాలనుకునే రాష్ట్రాలు తమ అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తాయి. బిడ్‌లలో ఖరారు చేసిన ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలా.. వద్దా..? అనేది పూర్తిగా రాష్ట్రాల సొంత నిర్ణయం. వారు తమ సొంత బిడ్‌లను ఎంచుకోవచ్చు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన పూర్తిగా అబద్ధం. రైతులకు విద్యుత్ మీటర్ల కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని కేసీఆర్​ చేసిన ప్రకటన పూర్తిగా తప్పు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి.. ఇలాంటి తప్పుడు, నిరాధారమైన ప్రకటనలు చేయడం తగదు." - ఆర్‌.కె.సింగ్‌, కేంద్ర మంత్రి

కేసీఆర్​ ఏమన్నారంటే..

విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం ముసాయిదా బిల్లు తెచ్చిందని.. సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానమని ఆరోపించారు. వంద శాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలిపారు. ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు పంపించారని వివరించారు. ఆ బిల్లుపై 7, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కూడా చెప్పారన్నారు. బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.. విద్యుత్‌ సంస్కరణలు వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని కేసీఆర్​ వివరించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details