Gadkari to visit vijayawada: రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన జాతీయ రహదారులకు చెందిన రూ.21,559 కోట్ల విలువైన 31 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్తగా మంజూరైన వాటికి భూమిపూజలను.. విజయవాడలో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం జగన్ చేతుల మీదుగా గురువారం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 11.45 గంటలకు గన్నవరం చేరుకోనున్న గడ్కరీ.. అక్కడి నుంచి ఇందిరాగాంధీ స్టేడియానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.15కు ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించి.. జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.
జాతీయ రహదారులకు చెందిన రూ.21,559 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:45 గంటలకు బెంజ్ సర్కిల్ పైవంతెనను గడ్కరీ ప్రారంభిస్తారు. అనంతరం 2 గంటలకు తాడేపల్లి వెళ్లనున్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై సీఎంతో సమీక్షించిన అనంతరం.. మధ్యాహ్న భోజనం చేస్తారు.