విజయవాడ కనకదుర్గ పైవంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 18న ప్రారంభించేందుకు కేంద్రమంత్రి గడ్కరీ సమయం కేటాయించారు. కార్యక్రమం ఖరారు చేస్తూ ఎంపీ కేశినేని నానికి.. గడ్కరీ లేఖ పంపారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పైవంతెన ప్రారంభించనున్నారు. దీనితోపాటుగా రాష్ట్రంలోని మరో 16 రహదారుల పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.
18న కనకదుర్గ పైవంతెన ప్రారంభం..సమాచారమిచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ - కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజా వార్తలు
ఈనెల 18న విజయవాడ కనకదుర్గ పైవంతెనను కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పైవంతెన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. దీనితోపాటు 16 రహదారుల పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.
Union Minister Gadkari