విద్యార్థుల బయోమెట్రిక్, యాప్ల బాధ్యతలు చూసుకునేందుకే ఉపాధ్యాయులకు సమయం సరిపోతోందని, విద్యార్థులకు బోధన ఎప్పుడు చేస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎఫ్టీసీ జలవనరుల కార్యాలయంలో కలెక్టర్ జె.నివాస్ అధ్యతన జిల్లా జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తమ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు తెలిపారు. ఉద్యోగులకు బయోమెట్రిక్ వల్ల కొందరు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వారాంతపు సెలవుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
unions meeting : 'సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి' - vijayawada latest news
విజయవాడలోని ఎఫ్టీసీ జలవనరుల కార్యాలయంలో కలెక్టర్ జె.నివాస్ అధ్యతన జిల్లా జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తమ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు వివరించారు.
విజయవాడలో ఉద్యోగసంఘాల సమావేశం