ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 2, 2022, 9:46 PM IST

ETV Bharat / city

వారికి చేయూతనిచ్చేందుకు వివిధ పథకాలకు శ్రీకారం: యూబీఐ చీఫ్​ జనరల్ మేనేజర్

Union Bank Loans: వ్యవసాయ, వ్యాపార రంగాలకు చేయూతనిచ్చేందుకు యూనియన్ బ్యాంక్ వివిధ పథకాలకు శ్రీకారం చుట్టిందని చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి (Union Bank Chief General Manager) అన్నారు. వివిధ వృత్తులు నిర్వహించే మహిళలకి రూ.50 లక్షల వరకు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా రుణ సౌకర్యం (Bank Loans) అందిస్తున్నామన్నారు. రుణాలపై మరింత సమచారం కోసం బ్యాంకు కార్యాలయాలను సంప్రదించాలని ఆయన సూచించారు.

యుూబీఐ ఛీప్ జనరల్ మేనేజర్
యుూబీఐ ఛీప్ జనరల్ మేనేజర్


UBI Loans: కొవిడ్​తో సహా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయని యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి (Union Bank Chief General Manager Brahmananda Reddy) అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ, వ్యాపార రంగాలకు చేయూతనిచ్చేందుకు యూనియన్ బ్యాంక్ వివిధ పథకాలకు (Scheme) శ్రీకారం చుట్టిందని తెలిపారు. నారీశక్తి పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు రుణ సౌకర్యం (Bank Loans) కల్పిస్తున్నామని, వివిధ వృత్తులు నిర్వహించే మహిళలకి రూ.50 లక్షల వరకు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా రుణ సౌకర్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.

డ్వాక్రా మహిళలకు ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తున్నామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రైతులు పంటలు వేసుకునేందుకు పంట రుణాల కోసం కిసాన్ తత్కాల్ (Kisan Tatkal) పేరిట రూ.50 వేల రుణ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. వైద్యులకు, హాస్పిటల్ అభివృద్ధికి అతి తక్కువ వడ్డీతో రూ.100 కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రుణాలపై మరింత సమచారం కోసం బ్యాంకు కార్యాలయాలను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details