ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పార్కింగ్‌లోని కారులో మృతదేహం.. మూడు రోజులుగా అక్కడే.. - పార్కింగ్‌లోని కారులో గుర్తు తెలియని మృతదేహం న్యూస్

విజయవాడ పటమటలంక పరిసరాల్లోని ఓ కారులో మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. కారులో కండ్రికకు చెందిన బాషా అనే డ్రైవర్ అనుమానస్పద స్థితిలో కారులో శవమై కనిపించాడు. కారు నుంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పార్కింగ్‌లోని కారులో మృతదేహం
పార్కింగ్‌లోని కారులో మృతదేహం

By

Published : May 3, 2022, 10:08 PM IST

Updated : May 4, 2022, 1:58 AM IST

విజయవాడ పటమటలంకలోని డీ మార్ట్ పరిసరాల్లో కారులో మృతదేహం లభ్యంకావటం కలకలం రేపుతోంది. డీ-మార్ట్ వీఎంసీ స్కూల్‌ వద్ద AP37 BA 5456 నెంబర్ గల కారులో కండ్రికకు చెందిన బాషా అనే డ్రైవర్ అనుమానస్పద స్థితిలో కారులో శవమై కనిపించాడు. పటమట ప్రాంతానికి చెందిన మహిళతో బాషా సన్నిహితంగా ఉండేవాడన్న మృతుని బంధువులు.. అతడి మృతికి అక్రమసంబంధమే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కారు నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు . సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరమే మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. మూడు రోజులుగా కారు రోడ్డుపక్కనే పార్కింగ్ చేసి ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై క్లూస్ టీంను ద్వారా విచారణ చేపట్టారు.

Last Updated : May 4, 2022, 1:58 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details