ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ukraine Students to Meet CM Jagan: నేడు సీఎంను కలవనున్న ‘ఉక్రెయిన్‌’ విద్యార్థులు - Ukraine students to meet Andhra Pradesh CM

Ukraine students to meet CM Jagan: ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి తిరిగి చేరుకున్న విద్యార్థులు.. ఇవాళ సచివాలయంలో సీఎం జగన్‌ను కలవనున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని.. ఏపీలో ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు తెలిపారు.

Ukraine students to meet CM Jagan
నేడు సీఎంను కలవనున్న ‘ఉక్రెయిన్‌’ విద్యార్థులు

By

Published : Mar 21, 2022, 7:27 AM IST

Ukraine students to meet CM Jagan: యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి తిరిగి చేరుకున్న విద్యార్థులు.. ఇవాళ సీఎం జగన్‌ను కలవనున్నారు. సచివాలయంలో మద్యాహ్నం 3 గంటలకు భేటీ అవ్వనున్నట్లు.. ఏపీలో ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌కు లేఖ రాయడంతోపాటు, సచివాలయంలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు 918 మంది విద్యార్థులు, ఇతరులు రాష్ట్రానికి రాగా, వారిలో 692 మందిని ప్రభుత్వ సహాయంతో స్వస్థలాలకు పంపినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details