ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పూర్వ విద్యార్థుల సంఘాల ఏర్పాటుకు యూజీసీ ఆదేశాలు - పూర్వ విద్యార్థుల సంఘాల ఏర్పాటు న్యూస్

ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలకు పలు అంశాలకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపింది.

పూర్వ విద్యార్థుల సంఘాల ఏర్పాటుకు యూజీసీ ఆదేశాలు
పూర్వ విద్యార్థుల సంఘాల ఏర్పాటుకు యూజీసీ ఆదేశాలు

By

Published : Jan 16, 2021, 7:56 AM IST

ఫిబ్రవరి 15లోగా 'అల్యుమ్ని కనెక్ట్‌' పేరుతో పూర్వ విద్యార్థుల సంఘాలు ఏర్పాటు చేయాలని యూజీసీ సూచించింది. విద్యా సంస్థలో చదివి విదేశాల్లో, మన దేశంలో స్థిరపడిన వారితో ఈ సంఘాలను ఏర్పాటు చేయాలని తెలిపింది.

విద్యా సంస్థలకు అకడమిక్‌ మద్దతు, నిధుల సమీకరణకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొంది. విద్యా సంస్థ కొత్తగా చేపట్టిన విధానాలపై పూర్వ విద్యార్థులకు సమాచారం అందించాలని, వెబ్‌నార్‌, కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనేందుకు వారిని ఆహ్వానించాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details