Governor Ugadi Wishes: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలంతా ఉజ్వల భవిష్యత్తుతో ముందుకుసాగాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు‘ఉగాది’ శుభాకాంక్షలు తెలిపారు. ‘శుభకృత్ నామ ఉగాది’.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగించాలని అభిలషించారు. షడ్రుసోపేతమైన 'ఉగాది పచ్చడి' ఏడాది పొడవునా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల రుచులను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుందని అన్నారు. ఆనందం- ఆశల పండుగ ఉగాది అని ఆయన అన్నారు.
CM jagan Wishes: రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ శుభకృత్ సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం ఆక్షాంచించారు. ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని సీఎం కోరారు. ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని కోరుకున్నారు. రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని సీఎం అభిలషించారు.
TDP Leaders Wishes: తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారు తొలి పండుగగా భావించే ఉగాది.. ప్రజలకు సకల శుభాలు కలిగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అన్ని కష్టాలుతొలగి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరారు. పాలకుల పాపాలతో, పెరిగిన ధరలు, పంట నష్టాలతో తీవ్ర కష్టాలు పడిన రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలన్నారు. చేదు మాత్రమే మిగిలిన సామాన్యుల జీవితాలకు తీపి తోడవ్వాలన్నారు.