విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో భాజపా పుంజుకుంటుందని పంచాంగంలో ఉందన్న సోము వీర్రాజు... హిందువులకు అండగా ఉంటామన్నారు. శ్రీశైలంలో భక్తులకు సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించిన సోము.. త్వరలోనే అక్కడ పర్యటిస్తామన్నారు.. గుంటూరులో జిన్నా టవర్స్ పేరు మార్చాల్సిందేనన్న ఆయన... పేరు మార్చేవరకు యువ మోర్చా రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తుందన్నారు. అసమర్థ వైకాపా పాలనను ప్రజలు తరిమికొట్టాలి భాజపా నేత సునీల్ దియోధర్ అన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు - ఏపీలో ఉగాది వేడకులు
విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం ఇంకా ముందుకు వెళుతుందని.. రాష్ట్రంలోనూ భాజపా పుంజుకుంటుందని పంచాంగకర్తలు పేర్కొన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు