అప్పటివరకు కళ్లముందే బుడి బుడి అడుగులతో తిరిగిన చిన్నారి అడుగులు ఆగిపోయాయి. చిలిపి చేష్టలతో తల్లిదండ్రుల కష్టాలను మరచిపోయేలా చేసే ఆ అల్లరి మూగబోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తే ఇక లేదని తెలుసుకున్న అమ్మనాన్నలు శోకసంద్రంలో మునిగిపోయారు. నీటిసంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని సుధీర్‌కుమార్ కాలనీలో జరిగింది.
ఆడుకుంటూ వెళ్లి చిన్నారి నిత్య(2) నీటి సంపులో పడిపోయింది. నీటి సంపులో పడిన గంట తర్వాత తమ కూతురి కోసం తల్లిదండ్రులు వెతకగా.. నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. తమ కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.