ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బైక్​-ట్రాక్టర్​ ఢీ​: తల్లీకొడుకులు మృతి - krishna district crime news

ద్విచక్రవాహనం-ట్రాక్టర్​ ఢీకొన్న ప్రమాదంలో బైకుపై వెళ్తున్న తల్లీకొడుకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా విజయవాడ టూటౌన్ చిట్టినగర్ సొరంగం సమీపంలో జరిగింది.

two persons died due tractor accident in vijayawada krishna district
బైకు- ట్రాక్టర్​ ఢీ​: తల్లీకొడుకు మృతి

By

Published : Oct 18, 2020, 2:02 PM IST

కృష్ణా జిల్లా విజయవాడ చిట్టినగర్​లో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని టూటౌన్ చిట్టినగర్ సొంరంగం సమీపంలో ట్రాక్టర్.. ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న తల్లీకొడుకులు మృతి చెందారు. మృతులు నగరంలోని చిట్టినగర్ కలరా ఆసుపత్రి సమీపంలో నివాసముంటున్న తాడిశెట్టి సామ్రాజ్యం, తాడిశెట్టి వెంకటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.

మృతుల్లో సామ్రాజ్యం మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుండగా.... మృతుడు వీఎమ్​సీలో శానిటరి మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజు తమ కళ్లముందే తిరిగే తల్లీకొడుకులు రోడ్డు ప్రమాద రూపంలో మరణించడాన్ని తోటి సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details