విజయవాడలో శానిటైజర్ మరణాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ప్రాణాలు ఇలాగే బలయ్యాయి. కొత్తపేట రాజుగారి వీధిలో సీరం నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యానికి బానిసై.. శానిటైజర్ సేవించాడు. తీవ్ర కడుపు మంటతో జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వించిపేటలో నివాసముండే తోటకూర బాగ్యరాజు సైతం.. మద్యానికి బానిసై శానిటైజర్ సేవించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని శానిటైజర్ అమ్మకాలపై పోలీసులు దృష్టి సారించారు.