దిగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో 230 మెగావాట్ల సామర్థ్యంతో(ఒక్కొక్కటి 115 మెగావాట్ల సామర్ధ్యం కలివి) మరో రెండు కొత్త టర్బైన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనల కోసం అభ్యర్థనలను (request for proposals) ఏపీ జెన్కో జారీ చేసింది. ఈ టర్బైన్ల ఏర్పాటు కోసం ఉద్దేశించించిన అంచనా విలువ రూ.384 కోట్ల రూపాయలుగా నిర్ధారించటంతో దీన్ని జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా టెండర్లను జారీ చేయనుంది.
దిగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రానికి మరో రెండు టర్బైన్లు! - టర్బైన్లు
దిగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో మరో రెండు టర్బైన్లను ఏర్పాటు చేయాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. 230 మెగావాట్ల సామర్థ్యంతో(విడివిడిగా 115మెగావాట్ల సామర్థ్యం) పనిచేసే టర్బైన్ల కోసం ప్రతిపాదన అభ్యర్థనల్ని ఆహ్వానించింది.
దిగువ సీలేరు
ప్రస్తుతం దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్టు.. 460 మెగావాట్ల సామర్థ్యంతో పని చేస్తోంది.
ఇదీ చదవండి:సీలేరు విద్యుత్ కేంద్రం సరికొత్త రికార్డు..