handloom workers killed: రాష్ట్రంలో ఇద్దరు చేనేత కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా పెడనలో అప్పుల బాధతో విషపు గుళికలు మింగి.. మురళి ఆనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో ఇటీవల పద్మనాభం అనే మరో చేనేత కార్మికుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అప్పుల బాధతో ఒకరు.. అనుమానాస్పద స్థితిలో మరొకరు!! - కృష్ణా జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
handloom workers killed: రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చేనేత కార్మికులు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడగా.. అనంతపురం జిల్లాలో మరొకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అనుమానాస్పద స్థితిలో మృతి..
handloom workers killed: మరోవైపు అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట గ్రామంలో నాగేష్(40) అనే చేనేత కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉరివేసుకున్నాడని మృతి భార్య సువర్ణ తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని నగేష్ తల్లి ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన మరో వ్యక్తితో నగేష్ భార్య వివాహేత సంబంధం కొనసాగిస్తోందని.. తన కొడుకు చావుకు ఆ వ్యక్తే కారణమని పోలీసుల ముందు వాపోయింది నగేష్ తల్లి.
ఇదీ చదవండి: