TODAY CRIME NEWS in AP: రాష్ట్రంలో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 11 మంది మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు.
రైలు కిందపడి వృద్ధురాలు ఆత్మహత్య
కడప జిల్లా కృష్ణాపురం వద్ద రైలు కిందపడి 80 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. కడప రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇంటి పైకప్పు కూలి ఇద్దరు పిల్లలు మృతి
ప్రకాశం జిల్లా దర్శి మండలం జముకులదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. పాత ఇల్లు మిద్దె కూలి ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు స్వాతి(5) యోహాను (7)గా గుర్తించారు.
అనుమానస్పదమృతి..
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కాకర్ల వెంకట నర్సయ్య(40)... కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామ శివారుల్లోని చెరువు కట్ట సమీపంలో ఇవాళ ఉదయం శవమై కనిపించాడు. శనివారం ఉదయం నర్సయ్య తన బంధువు భాగ్యలక్ష్మీకి బ్యాంకులో సాయం చేయడం కోసం దొనకొండ వెళ్లాడు. అక్కడ బ్యాంకు పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. కానీ సాయంత్రమైనా నర్సయ్య ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. దొనకొండ గ్రామ శివారులో శవమై కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెద్దపులిపాకలో మహిళ అనుమానాస్పద మృతి
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెద్దపులిపాకలోని పొలాల్లో వణుకూరు రజిని(33) అనే మహిళ అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దుగ్గిరాలలో పాముకాటుతో మహిళ మృతి
గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మహిళ పాముకాటుతో మరణించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కల్లకుంట జయమ్మ(47) అనే మహిళ ఓ దుకాణంలో పని చేస్తోంది. షాపును శుభ్రం చేస్తున్న క్రమంలో ఫ్రిజ్ కింద నుంచి వచ్చిన పాము ఆమెను రెండుసార్లు కాటేసింది. చుట్టుపక్కలవారు గమనించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఆమె దారిలోనే ప్రాణాలు విడిచింది.
ఆటో-బోలెరో వాహనం ఢీ..