సున్నా వడ్డి పంట రుణాల పథకం ఒక బోగస్ అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం పెట్టిన లక్ష రూపాయల షరతు వల్ల ఇరవై నుంచి ముపై శాతం మంది రైతులకు మాత్రమే వర్తిస్తుందన్న ఆయన... డెభై నుంచి ఎనభై శాతం మంది రైతులకు ఈ పథకం వర్తించదన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులందరికీ వర్తించేదని, 2011 అక్టోబర్ 2న 142వ గాంధీ జయంతి సందర్బంగా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ... ఆ పై పావల వడ్డి ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సున్నా వడ్డి పథకంపై సమీక్ష చేసి రైతులందరికి వర్తింప చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.