ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేది కాంగ్రెస్ పార్టీనే' - Tulasireddy comments on chandrababu

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని... ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. తెదేపా, వైకాపా, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదన్నారు. విజయవాడలోని ఆంధ్రభవన్​లో నిర్వహించిన సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు.

Tulasireddy criticize jagan and Chandrababu
మాట్లాడుతున్న తులసిరెడ్డి

By

Published : Feb 20, 2020, 5:30 PM IST

మాట్లాడుతున్న తులసిరెడ్డి

పార్లమెంటులో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసి నేటికి ఆరేళ్లు అయిందని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రభవన్​లో నిర్వహించిన సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడారు. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న భాజపా... నేడు అది ముగిసిన అధ్యాయమని మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రానికి ఇవ్వాల్సిన లోటు బడ్జెట్ ఇవ్వకుండా... తీవ్ర అన్యాయం చేస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తెదేపా, వైకాపా, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే వాటి సాధన సాధ్యమన్నారు. 25 ఎంపీలు ఇస్తే హోదా సాధిస్తామని చెప్పిన వైకాపా... కేంద్రం ముందు మోకరిల్లారని ఆరోపించారు. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులు ఇవే

ABOUT THE AUTHOR

...view details