వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. రోడ్ల అభివృద్ధి కోసమంటూ చమురు ధరలపై సెస్ వసూలు చేసి రోడ్ల దుస్థితిని గాలికొదిలేసిందని మండిపడ్డారు. రోడ్ల అభివృద్ధి పేరుతో మళ్లీ ఇప్పుడు 2 వేల 205 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలని భావిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా జగన్‌కు పరిపాలించే అర్హత లేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తోంది: తులసిరెడ్డి
ముఖ్యమంత్రిగా జగన్‌కు పరిపాలించే అర్హత లేదని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తోందని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఋణాంధ్రప్రదేశ్గా మారుస్తోంది
మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని.., పాకిస్థాన్ తరహా నియంతృత్వం రాజ్యమేలుతోందని పలు దేశాలు నివేదికలు ఇవ్వటం గమనార్హమన్నారు. భారత రాజ్యాంగానికి మూలస్తంభమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రజాస్వామ్యవాదులందరూ ముందుకు రావాలని కోరారు.
ఇదీచదవండి: రామకృష్ణారెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం: చంద్రబాబు