రాష్ట్రంలో ఇప్పటివరకు 129 ఆలయాలపై దాడి జరిగితే ఒక్క ఘటనలో అయినా దోషుల్ని గుర్తించారా? అని పీసీసీ కార్వనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రశ్నించారు. విజయవాడ సీతమ్మ విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని తులసిరెడ్డి సందర్శించారు. దోషుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా అలసత్వం వహిస్తున్నారని అన్నారు. దోషుల్ని పట్టుకోవడం చేతకాకపోతే.. సీఎం జగన్ రాజీనామా చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
'దోషుల్ని పట్టుకోవడం చేతకాకపోతే.. సీఎం రాజీనామా చేయాలి' - congress fires on cm jagan
ఆలయాలపై దాడుల ఘటనలో దోషుల్ని పట్టుకోవడం చేతకాకపోతే.. సీఎం జగన్ రాజీనామా చేయాలని పీసీసీ కార్వనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. దోషుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.
tulasi reedy fires on cm jagan on temple demolish incident
వైకాపా పాలనలో ప్రజలకు, దేవుళ్లకు రక్షణ లేకుండా పోయిందని తులసి రెడ్డి అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు..?