సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, జగన్‌ది కమీషన్ల కక్కుర్తి తప్ప... రాష్ట్రాల శ్రేయస్సు కాదని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84, 85 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల మీద కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే కేంద్ర జలసంఘం, నది యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పక తీసుకోవాలని స్పష్టం చేశారు.
కేసీఆర్, జగన్‌ది కమీషన్ల కక్కుర్తి: తులసిరెడ్డి
ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఇవ్వకపోతే అప్పటివరకు పెట్టిన ఖర్చుకు జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు. రెండు ప్రభుత్వాలు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకొని ముందుకుసాగాలని సూచించారు.
తులసిరెడ్డి
అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఇవ్వకపోతే అప్పటివరకు పెట్టిన ఖర్చుకు జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కక్కుర్తి కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం నేరమని అభిప్రాయపడ్డారు. రెండు ప్రభుత్వాలు అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకొని ముందుకుసాగాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందన్నారు.
ఇదీ చదవండీ... 'ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది'