ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వడ్డీంపులు, వాయింపులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు' - తులసి రెడ్డితాజా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్​లను పెంచటం గర్హనీయమని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ఇసుక, సిమెంట్, పెట్రోల్, ఆర్టీసీ ఛార్జీలను పెంచి మధ్యతరగతి కుటుంబాలపై భారం వేస్తున్నారని విమర్శించారు.

'వడ్డీంపులు, వాయింపులతో సీఎం జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు'
'వడ్డీంపులు, వాయింపులతో సీఎం జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు'

By

Published : Nov 22, 2020, 6:20 PM IST

రాష్ట్ర ప్రభుత్వం టోల్ ట్యాక్స్​లను పెంచటం గర్హనీయమని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్... వడ్డీంపులు, వాయింపులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. మద్యం ధరలు పెంచి ప్రభుత్వం మందుబాబుల రక్తం పిలుస్తోందన్నారు. ఇసుక, సిమెంట్, పెట్రోల్, ఆర్టీసీ ఛార్జీలను పెంచి మధ్యతరగతి కుటుంబాలపై భారం వేస్తున్నారన్నారు.

కర్రీ పాయింట్స్​పైనా వృత్తి పన్ను విధించారని.. ఆఖరికి జుట్టు పన్ను, గడ్డంపై పన్ను, బోడి గుండుపై పన్ను వేసిన ఆశ్చర్యం లేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇస్తుంది గోరంత అయితే వారి దగ్గర నుంచి తీసుకుంటుంది మాత్రం కొండంతని అన్నారు. ప్రభుత్వ సలహాదారులకు, ప్రకటనలకు కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి... కడపలో ఉన్న సీపీ బ్రౌన్ పరిశోధన కేంద్రానికి 30 లక్షలు ఇచ్చే స్థోమత లేదా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details