అర్హులైన వారికి కాపు నేస్తం పథకం వర్తింపజేయాలి: తులసిరెడ్డి - అర్హులైన వారికి కాపు నేస్తం పథకం వర్తింపచేయాలి: తులసిరెడ్డి
కుల ధ్రువీకరణ పత్రాలను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన కాపు మహిళలకు కాపు నేస్తం పథకం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన కాపు మహిళలు ఒక్కరు కూడా లేరని విమర్శించారు.
అర్హులైన వారికి కాపు నేస్తం పథకం వర్తింపచేయాలి: తులసిరెడ్డి
కాపు నేస్తం పథకంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన కాపు మహిళలు ఒక్కరు కూడా లేరని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. రాయలసీమలో కాపులను రెడ్డిలుగా పిలుస్తారని వారు కుల ధ్రువీకరణ పత్రాలలో కాపు సామాజిక వర్గంగా ఉంటుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో గ్రామ వాలంటీర్లతో తిరిగి సర్వే చేయించాలని కోరారు. సర్వేలో కుల ధ్రువీకరణ పత్రాలను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన కాపు మహిళలకు కాపు నేస్తం పథకం అమలు చేయాలన్నారు.
TAGGED:
kapu nestam scheme