ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దోచుకున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారా' - ayyannapatrudu latest news

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో హిందూయిజం లేకుండా చేయాలనుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తులను అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

ayyannapatrudu fire on chief minister
మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

By

Published : May 24, 2020, 11:56 PM IST

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో హిందూయిజం లేకుండా చేయాలనుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తిరుమల వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్న వారెవ్వరూ బాగు పడలేదని ఆ విషయం గ్రహించాలని హితవు పలికారు. ఏడాదిగా రాష్ట్రాన్ని దోచుకున్నందుకు వైకాపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి ఆస్తులను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. చివరకు స్వామి వారి లడ్డూలు కూడా స్వీటు షాపుల్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:రేపు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details