ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ ఆస్తుల జప్తు వ్యవహారంలో ఈడీ అప్పీలు - భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ ఆస్తుల జప్తు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు

భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ ఆస్తుల జప్తు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది.

ts high court on bharathi cement
భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ ఆస్తుల జప్తు వ్యవహారంలో ఈడీ అప్పీలు

By

Published : Apr 21, 2021, 8:23 AM IST

భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులను జప్తు నుంచి విడుదల చేయాలంటూ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (దిల్లీ) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది. భారతి సిమెంట్స్‌ కేసు వ్యవహారంలో దాని డైరెక్టర్‌, వై.ఎస్‌.జగన్‌ సన్నిహితుడైన జెల్లా జగన్‌మోహన్‌రెడ్డికి ల్యాంకోహిల్స్‌లో ఉన్న అపార్టుమెంట్‌, కడప జిల్లా కోడూరు మండలం శెట్టిగుంటలో ఉన్న 27 ఎకరాల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ జప్తును రద్దు చేస్తూ వెంటనే వాటిని విడుదల చేయాలని అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ తీర్పునిచ్చింది.

దీన్ని సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన అప్పీలుపై మంగళవారం జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆ తరువాత ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బ్యాంకు హామీ తీసుకొని విడుదల చేయాలన్న అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఉత్తర్వులపై ఈడీ వేసిన అప్పీల్‌పైనా హైకోర్టు ఇటీవల తీర్పు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details