ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ట్రంప్​ ట్రావెల్​ బ్యాన్​.. అమెరికా న్యాయవాదితో ముఖాముఖి

ప్రపంచాన్ని కరోనా మహామ్మారి చుట్టుముట్టిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశానికి ఎవరూ వలస రాకుండా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగార్థం అమెరికా వెళ్లే వారిలో ఎక్కువ భాగం భారతీయులే ఉంటారు. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లే వారిపై, అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులపై, ఉద్యోగులపై ఈ నిర్ణయం ఎలా ఉండబోతుందో అమెరికాలో ఇమ్మిగ్రేషన్​ న్యాయవాది జెనెతా కంచర్ల గారితో ఈటీవీ భారత్ ప్రతినిధి రంగారావు ముఖాముఖిలో తెలుసుకుందాం.

ట్రంప్​ ట్రావెల్​ బ్యాన్​.. అమెరికా న్యాయవాదితో ముఖాముఖి
ట్రంప్​ ట్రావెల్​ బ్యాన్​.. అమెరికా న్యాయవాదితో ముఖాముఖి

By

Published : Apr 22, 2020, 7:12 AM IST

ట్రంప్​ ట్రావెల్​ బ్యాన్​.. అమెరికా న్యాయవాదితో ముఖాముఖి

ప్ర: ట్రంప్​ తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం ప్రభావం ఏలా ఉండబోతుంది?

జ:ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ట్విట్టర్​ ద్వారా ఇతర దేశాల వారికి ట్రావెల్​ బాన్​ ప్రకటించారు. ఇంకా ఏయే విభాగాలపై నిషేధం ఉంటుందనేది ప్రత్యేకంగా వివరించలేదు.

ప్ర: ఆ నిర్ణయం వల్ల భారతీయ విద్యార్థులు, యువతపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

జ:ఇమ్మిగ్రేషన్​ రద్దు చేయడం వల్ల భారతీయ యువత ఆందోళన చెందే అవకాశం ఉంది. కానీ తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తోంది.

ప్ర: అసలు అమెరికాలో ఎక్కువగా ఏయే రంగాల్లో భారతీయులు పనిచేస్తున్నారు?

జ:ఎక్కువగా ఐటీ, డాక్టర్లు, లాయర్లు, నర్సులు, రీసెర్చ్​ విభాగాల్లో ఉంటారు. అదే కాకుండా మిగతా రంగాల్లో కూడా భారతీయులు పనిచేస్తున్నారు.

ప్ర: కేవలం కరోనా వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఇంకెమైనా కారణాలు ఉన్నాయా?

జ: కచ్ఛితంగా కరోనా వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.

ప్ర: ట్రంప్​ గతంలో తీసుకున్న నిర్ణయాలు అక్కడి న్యాయవాదులు తోసిపుచ్చారు. ఇప్పుడేమైనా అలాంటి అవకాశం ఉంటుందా?

:కచ్ఛితంగా అని చెప్పలేం. కానీ అవకాశం ఉంటుంది.

ప్ర: అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం ఎలా చూపబోతుంది?

జ:ప్రస్తుతం అక్కడ భారతీయ విద్యార్థులకు చదువు పరంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆన్​లైన్​లో క్లాసులు వినే అవకాశం ఇప్పటికే కల్పిస్తున్నారు.

ప్ర: ట్రావెల్​ బ్యాన్​ గతంలో ఎవరైనా అధ్యక్షులు తీసుకున్నారా?

జ: చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.

ప్ర:అక్కడే అమెరికాలో ఉన్నవాళ్లకు ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుంది?

జ: అమెరికాలో ఉన్న వాళ్లకు ఈ ప్రభావం ఉండకపోవచ్చు. బయటి నుంచి వచ్చే వాళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ప్ర: ఈ నిర్ణయం వల్ల ఐటీ కంపెనీలు కొనసాగించకపోవచ్చు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందా?

జ:అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక దెబ్బ అని చెప్పవచ్చు.

ప్ర:ఈ నిర్ణయం తాత్కాలిక ఆర్డర్ అన్నారు, అంటే ఎంత కాలం ఉంటుంది?

జ: తాత్కాలికం అన్నారు కాబట్టి 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చు.

ప్ర: మీరు ఓక న్యాయవాదిగా అక్కడి విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఎలాంటి సలహాలు ఇవ్వనున్నారు?

జ:ఉద్యోగార్థులకు ఇబ్బంది ఉండదు. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ప్ర: కరోనా ప్రభావం న్యూయార్క్​లో ఎలా ఉంది?

జ: న్యూయార్క్​లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి.

ప్ర: తాజా ట్రావెల్​ బ్యాన్​ నిర్ణయం 6 నెలల్లో ముగుస్తుందా.. తర్వాత కూడా ఆ ప్రభావం ఉంటుందా.?

జ:ప్రత్యేక విభాగాల్లో ఉన్న వారిపై ప్రభావం చూపనుంది.

ప్ర:ఈ నిరుద్యోగం కోసం ఎలాంటి సహాయం చేస్తుంది?

జ: గత నెల వరకు నిరుద్యోగ భృతి కోసం రెండు కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక సహాయం సైతం చేస్తున్నారు.

ప్ర:ఇలాంటి తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం, ఈ నిర్ణయం వల్ల ఏయే రంగాలపై ప్రభావం ఉండనుంది?

జ:కరోనా వైరస్​ వల్ల ఒక్క రంగంలో అని కాకుండా అన్ని రంగాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది.

ఇదీ చూడండి :రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా.. కొత్త కేసులు 39

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details