ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRS Dharna over Paddy procurement :' రైతును కష్టపెట్టిన ఏ సర్కార్ నిలబడలే' - Paddy procurement issues in telangana

వరి ధాన్యం కొనుగోళ్ల(TRS Dharna over Paddy procurement) విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస ధర్నాకు దిగింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతునిస్తున్నారు. ధాన్యం కొనాల్సిన కేంద్రమే తాము కొనమని చెబితే.. రైతులు ఎక్కడికి పోవాలని.. పండించిన పంటనంతా ఏం చేయాలని మంత్రులు మోదీ సర్కార్​ను ప్రశ్నించారు. కర్షకులను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం నిలబడినట్లు చరిత్రలో లేదని అన్నారు. దేశమంతా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

TRS
TRS

By

Published : Nov 12, 2021, 8:04 PM IST

వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెరాస ధర్నా(TRS Dharna over Paddy procurement) చేసింది. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మోదీ సర్కార్​కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది.

సమస్య తీవ్రత చాటేలా..

సమస్య తీవ్రతను చాటేలా తెలంగాణ వ్యాప్తంగా తెరాస శ్రేణులు(TRS protest over paddy procurement) నిరసనకు దిగాయి. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద తెరాస నేతలు ధర్నా(TRS dharna at Indira Park) చేపట్టారు. ఈ నిరసనలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రైతుల పట్ల కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతలకు అండగా ఉండాల్సిన సర్కార్.. వారి నడ్డివిరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు..

సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు(Telangana health minister Harish Rao) పాల్గొన్నారు. రైతులతో కలిసి కేంద్ర సర్కార్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ల నోట్లో మోదీ ప్రభుత్వం సున్నం కొట్టేందుకు యత్నిస్తోందని మంత్రి హరీశ్ విమర్శించారు.

రైతును మోసం చేసి ఎవరూ బాగుపడలే..

మేడ్చల్ డిపో ఎదుట తెరాస ధర్నాలో కార్మిక మంత్రి మల్లారెడ్డి(Telangana labor minister Malla Reddy) రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రభుత్వం.. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ రైతుల అభివృద్ధికి కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్నదాత నడ్డివిరుస్తోందని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. కర్షకులను కష్టపెట్టే.. రైతులను మోసం చేసే ఏ పార్టీ.. ఏ ప్రభుత్వం బాగుపడినట్లు చరిత్రలో లేదని చెప్పారు.

ఖమ్మంలో తెరాస ధర్నా..

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్​లో(TRS dharna at Khammam) తెరాస ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.

అప్పటివరకు మా పోరాటం ఆగదు..

వ్యవసాయరంగాన్ని ప్రవేటుపరం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Telangana minister errabelli dayakar rao) ఆరోపించారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎఫ్​సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా రైతుల నుంచి వరి ధాన్యం కొనేవరకు పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.

రైతు హితం కంటే.. రాజకీయ ప్రయోజనమే ముఖ్యం..

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌ ధర్నాలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి(Telangana R&B minister Prashanth Redddy) పాల్గొన్నారు. తెరాస శ్రేణులతో కలిసి రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ధాన్యం కొనబోమని కేంద్రమే చెబితే.. రైతులు ఎటు పోవాలని.. పండించిన పంటను ఏం చేయాలని ప్రశ్నించారు. భాజపా సర్కార్.. రైతుల హితం కంటే.. రాజకీయప్రయోజనాలకే ప్రాముఖ్యతనిస్తోందని ఆరోపించారు.

ఇక్కడ సబితా.. అక్కడ నిరంజన్..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో(TRS dharna in rangareddy) తెరాస ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొనగా.. రైతులకు మద్దతుగా చేస్తున్న ఆందోళనలో వనపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట కేంద్ర సర్కార్​కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్(Telangana agriculture minister Niranjan reddy) రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సిరిసిల్లలో కేటీఆర్..

కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెరాస ఆధ్వర్యంలో ధర్నా(TRS dharna in karimnagar) నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా(TRS dharna in Sircilla district)లో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తెరాస చేపడుతున్న ధర్నాలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Telangana IT minister KTR) పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details