తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వరంగల్ - నల్గొండ - ఖమ్మం స్థానం ఓట్ల లెక్కింపు రెండో రౌండ్‌లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 3,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15,857 ఓట్లు రాగా.. తీన్మార్ మల్లన్నకు 12,070 ఓట్లు వచ్చాయి. కోదండరాంకు 9,448 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 6,669 ఓట్లు, రాములు నాయక్ (కాంగ్రెస్)కు 3,244 ఓట్లు పోలయ్యాయి.
హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానంలో మొదటి రౌండ్ ఫలితాలు వచ్చాయి. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో సురభి వాణీదేవికి 17,439 ఓట్లు, రాంచందర్‌రావుకు 16,385 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు, చిన్నారెడ్డి (కాంగ్రెస్)కి 5,082 ఓట్లు వచ్చాయి.