స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ భవనాలు, రహదారులు త్రివర్ణ పతాక రంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి.
విజయవాడలోని రాజ్ భవన్ తో పాటు బందరు రోడ్డు మెుత్తం విద్యుత్ దీపాలు, ఎల్ఈడీ దీపాలతో అలంకరించటంతో నగరవాసులను ఆకట్టకుంటున్నాయి. రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలను మువ్వన్నెల జెండాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యమైన బహిరంగ ప్రదేశాలు, చారిత్రక కట్టడాల వద్ద కూడా అలంకరణ చేశారు. ఆజాదీగా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను మువ్వన్నెల జెండాలతో తీర్చిదిద్దారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణం మూడు రంగుల విద్యుత్ దీపకాంతులతో వెలుగులీనుతోంది. ప్రాంగణంలోని ఐదు బ్లాక్ లతో పాటు అదే ఆవరణలో ఉన్న శాసనసభ, మండలి భవనాలను కూడా సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు.
జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి