ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tributes to NTR: ఎన్టీఆర్​కు ప్రముఖుల నివాళులు - ఎన్టీఆర్​ కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులు

Tributes to NTR: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వమని కొనియాడారు.

Tributes to NTR
ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

By

Published : May 28, 2022, 11:51 AM IST

Tributes to NTR: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ నివాళులర్పించారు.

తెలుగువారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం ఎన్టీ​ఆర్​ది అని కొనియాడారు. క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన ఎన్టీఆర్ పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ నివాళులర్పించారు. సీఎంగా ఎన్టీఆర్‌ సేవలను ట్విటర్‌ వేదికగా గవర్నర్ ప్రస్తావించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details