ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బాలయోగి సేవలు స్ఫూర్తిదాయకం' - gmc Balayogi 15th Vardhanthi

విజయవాడలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో దివంగత జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​తోపాటు పలువురు పార్టీ నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

gmc Balayogi 15th Vardhanthi
జీఎంసీ బాలయోగి వర్ధంతి

By

Published : Mar 3, 2021, 5:12 PM IST

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కోనసీమ అభివృద్ధికి దివంగత జీఎంసీ బాలయోగి స్ఫూర్తిదాయకమైన సేవలందించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కొనియాడారు. విజయవాడలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన బాలయోగి వర్ధంతి కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి నివాళులర్పించారు. తెలుగువారి ప్రతిభను చాటుతూ లోక్‌సభ స్పీకర్‌ హోదాలో దేశ రాజకీయాల్లోనే ఒక ధ్రువతారగా వెలిగారని లోకేశ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, అశోక్ బాబు, గోనుగుంట్ల కోటేశ్వరరావు, సయ్యద్ రఫీ, బుచ్చి రాం ప్రసాద్, ఎం.ఎస్.రాజు, వేమూరి ఆనంద సూర్య, గంజి చిరంజీవి, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి:ముగిసిన పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు

ABOUT THE AUTHOR

...view details