ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏడాదిగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం' - Tribal Welfare Teachers Association press meet

తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. విధుల నుంచి 6 వందల మందిని తొలగించారని వాపోయారు.

Tribal Welfare Teachers Association
రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ టీచర్స్ అసోసియేషన్

By

Published : Apr 15, 2021, 9:51 PM IST

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ టీచర్స్ ఆసోసియేషన్ విజయవాడలో రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించింది. గత ఏడాది మార్చ్ నెల నుంచి నేటి వరకు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. కరోనా ప్రభావంతో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న ఉద్యోగాల్లో నుంచి 6 వందల మంది వొకేషనల్ శిక్షకులను తొలగించారని ఆవేదన చెందారు.

2016 నుంచి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న తమను కొనసాగిస్తూ... ఒకేషనల్ ఉపాధ్యాయులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యం ఉండలాంటే ఒకేషనల్ ఉపాధ్యాయులను కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. తమ సమస్యనను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం ఇస్తామని.. స్పందించకుంటే రాష్ట్రస్థాయి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details