విజయవాడ శివారు కానూరు వద్ద ఉన్న ఏపీఎండీసీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. తమను అకారణంగా తొలగించేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుందంటూ...తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తోన్న గిరిజనులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులు సమయం ఇస్తే.. గనులశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కారం చూపుతామని అధికారులు హామీ ఇచ్చినా...నిరసన విరమించేందుకు ఉద్యోగులు ససేమిరా అన్నారు.
ఏపీఎండీసీ ఎదుట గిరిజన ఉద్యోగుల ఆందోళన.. - ఏపీఎండీసీ ఎదుట గిరిజన ఉద్యోగుల ఆందోళన తాజా వార్తలు
విజయవాడలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఏపీడీఎంసీ అకారణంగా తమను ఉద్యోగం నుంచి తొలగించిందంటూ గిరిజన ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. ఉద్దేశపూర్వకంగా గిరిజనులను మాత్రమే తప్పించారంటూ ఆరోపిస్తూ నిరసనకు దిగారు.
ఏపీఎండీసీ ఎదుట గిరిజన ఉద్యోగుల ఆందోళన
మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నేరుగా ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో చరవాణిలో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా తమను మాత్రమే ఉద్యోగం నుంచి తొలగించారని గిరిజన ఉద్యోగులు ఆరోపించారు.
ఇదీచదవండి: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అమరావతి రైతుల సెగ