విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన ప్రగతి ట్రాన్స్‌పోర్టు దోపిడికి మందు దొంగలు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాతబస్తీలోని ప్రగతి ట్రాన్స్ పోర్ట్ కార్యాలయంలో జరిగిన దాడి కేసును వేగంగా దర్యాప్తు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ విజయరావు స్పష్టం చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు . సీసీ దృశ్యాల ఆధారంగా నిందితులు ఏ మార్గంలో వచ్చారు ? ఎటువైపు వెళ్లారు ? అనే విషయాలను పరిశీలించారు. ట్రాన్స్ పోర్టు సిబ్బందిని విచారించారు.
పక్కా ప్రణాళికతోనే ట్రాన్స్పోర్ట్ దోపిడి : విజయవాడ డీసీపీ - perfect plan
విజయవాడ ప్రగతి ట్రాన్స్‌పోర్టులో దోపిడికి పాల్పడి మూడున్నర లక్షలు దోచుకెళ్లిన ఘటనపై నగర డీసీపీ విజయరావు దర్యాప్తు ముమ్మరం చేశారు. పక్కా ప్రణాళికతోనే నిందితులు దోపిడికి యత్నించినట్లు స్పష్టం చేశారు.

విజయవాడ డీసీపీ