ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hijras: ఆ మహిళలు వేధిస్తున్నారు.. పోలీసులకు హిజ్రాల ఫిర్యాదు - విజయవాడలో మహిళలపై హిజ్రాల ఫిర్యాదు న్యూస్

విజయవాడ సింగ్ నగర్​లో మహిళా వడ్డి వ్యాపారులు తమను చంపుతామని బెదిరింపులకి గురిచేస్తున్నారంటూ.. స్థానికంగా నివాసముంటున్న హిజ్రాలు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. తమను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు.

Hijras: ఆ మహిళలు వేధిస్తున్నారు.. పోలీసులకు హిజ్రాల ఫిర్యాదు!
Hijras: ఆ మహిళలు వేధిస్తున్నారు.. పోలీసులకు హిజ్రాల ఫిర్యాదు!

By

Published : Jun 13, 2021, 12:19 PM IST

విజయవాడ సింగ్ నగర్ లో నివాసముండే హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. సెవెన్ సిస్టర్స్ గా పిలవబడే బెజవాడ లక్ష్మి, ఆమె అనుచరుల వద్ద తాము రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నామని తెలిపారు. తమ నుంచి నూటికి 15 రూపాయలు వడ్డీ వసూలు చేశారని ఆరోపించారు.

కరోనా కారణంగా.. తాము 2 నెలలుగా వడ్డీ చెల్లించలేకపోయామని.. అప్పటి నుంచి ఆ మహిళా వ్యాపారులు తమను మానసికంగా వేధిస్తున్నారని.. ఆవేదన చెందారు. డబ్బులు చెల్లించకుంటే చంపేస్తామంటూ ఫోన్ కాల్స్​లో బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details